మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

02-10-2026 | 08:11pm

కోదాడ అక్టోబర్ 2 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీమ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు.గాంధీజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర, నడిగూడెం మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండు మహేందర్, మునగాల మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు తక్కెళ్లపాటి సాయి, కోదాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఏలుగురి నరేష్, యువజన నాయకులు ఎం. అంజి, ఎస్‌కే. పాషా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు