పొలార్డ్‌కు జాక్‌పాట్.. ముంబైకి షాక్

08-10-2026 | 12:06pm

SA20 Season 5 Auction 2026లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ కుటుంబంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ Kieron Pollard తొలిసారి Super Kings ఫ్రాంచైజీలోకి అడుగుపెట్టాడు. 39 ఏళ్ల Pollardను Joburg Super Kings R1.5 మిలియన్‌కు సొంతం చేసుకుంది. Mumbai Indians, MI Cape Town, MI Emirates, MI New York వంటి ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన Pollard.. ఇప్పుడు Joburg Super Kings జెర్సీలో కనిపించనున్నాడు. అంతేకాదు, అతడి కోసం మరో ఫ్రాంచైజీ పోటీకి రాకపోవడం కూడా SA20 Auctionలో ఆసక్తికర పరిణామంగా మారింది.

అసలు బిగ్ డీల్ అతడిదే..

అయితే SA20 Auction 2026లో అత్యధిక ధర మాత్రం Pollardకు దక్కలేదు. అతడి కంటే దాదాపు రెండు దశాబ్దాలు చిన్నవాడైన దక్షిణాఫ్రికా U19 ఆటగాడు Jason Rowles ఏకంగా R2.9 మిలియన్‌కు Joburg Super Kings‌తో ఒప్పందం చేసుకున్నాడు. అత్యధిక purseతో Auctionలోకి అడుగుపెట్టిన Joburg Super Kings.. Pollard, Rowlesతో పాటు మరో నాలుగు ప్లేయర్లను కూడా తమ జట్టులో చేర్చుకుంది. మాజీ కెప్టెన్ Faf du Plessisను R2.7 మిలియన్‌కు తిరిగి yellow kitలోకి తీసుకొచ్చింది.

Faf తిరిగొచ్చాడు.. Super Kings స్కెచ్ ఇదే!

Faf du Plessis తిరిగి Super Kings గూటికి చేరడంతో జట్టుకు అనుభవం మరింత పెరిగింది. Dayyaan Galiemతో పాటు Blessing Muzarabani, Andries Gousలను nomination roundలో జట్టు ఎంపిక చేసుకుంది. దీంతో Joburg Super Kings Squadలో అనుభవజ్ఞులైన క్రికెటర్లతో పాటు యువ ప్రతిభకు కూడా చోటు కల్పించినట్లైంది. ముఖ్యంగా Pollard, Faf వంటి పేర్లు జట్టులో చేరడంతో SA20 Season 5పై అంచనాలు మరింత పెరిగాయి.

MI Cape Town కూడా తగ్గేదేలే..

మరోవైపు MI Cape Town కూడా Auctionలో ఆరు slotsను భర్తీ చేసింది. రాత్రి తొలి bidగా Shimron Hetmyerను సొంతం చేసుకుంది. అనంతరం Wiaan Mulder కోసం Joburg Super Kings నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరకు అతడిని జట్టులోకి తీసుకుంది. ఇక Trent Boult మరోసారి MI Cape Town ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చాడు. Daniel Smith, Lehan Botha, Oliver Whiteheadలను కూడా జట్టు ఎంపిక చేసుకుంది. మొత్తంగా SA20 Auction 2026లో Pollard Super Kings‌లోకి రావడం, Faf తిరిగి yellow kit ధరించనుండటం, Jason Rowles భారీ ధర పలకడం హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ కొత్త కాంబినేషన్ SA20 Season 5లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు