యువ స్విమ్మర్ ధినిధి సంచలనం
యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం
16 ఏళ్లకే జాతీయ రికార్డు
సెనెగల్, నవంబర్ 3 : భారత స్విమ్మింగ్(Indian Swimming) సంచలనం ధినిధి దేశింగు(Dhinidhi Desinghu) సరికొత్త చరిత్ర సృష్టించింది. యూత్ ఒలింపిక్స్‌లో(Youth Olympics) అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకం అందించింది.సెనెగల్‌లోని డాకర్ వేదికగా జరుగుతున్న 2026 యూత్ ఒలింపిక్ గేమ్స్లో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలోనే పతకం సాధించిన తొలి భారతీయ స్విమ్మర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్లో 56.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త జాతీయ రికార్డును కూడా నమోదు చేసింది.
యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్‌గా నవశకానికి నాంది పలికింది. రేసులో మొదటి 50 మీటర్లు ముగిసేసరికి ఆమె 5వ స్థానంలో ఉన్నప్పటికీ, చివరి 50 మీటర్లలో అద్భుతమైన వేగంతో పుంజుకుని మూడో స్థానంలో నిలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది.
చిన్నతనంలో నీళ్లంటే విపరీతమైన భయం ఉండి, స్విమ్మింగ్ పూల్ లోకి దిగడానికి కూడా నిరాకరించిన ధినిధి, నేడు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. బెంగళూరుకు చెందిన ధినిధి దేశింగు గతంలో 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం 14 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున పాల్గొన్న అత్యంత పిన్న వయస్కురాలైన అథెట్‌గానిలిచింది. ఆ తర్వాత జాతీయ క్రీడలు, ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్‌లలో రికార్డుల వేటను కొనసాగించింది.