మురసు ముసురు
04-11-2026 | 09:36am
దమ్మపేట మండలంలో 165 మి.మీ. వర్షపాతం నమోదు
దమ్మపేట, నవంబర్ 04 (విజయ క్రాంతి): మురసు తుఫాను(Cyclone Murasu) ప్రభావంతో గత 24 గంటల్లో దమ్మపేట మండలంలో(Dammapeta mandal) భారీ వర్షపాతం నమోదైంది. మండలవ్యాప్తంగా మొత్తం 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ మద్దినేని మురళి వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దమ్మపేట నుండి మందలపల్లి వెళ్లే ప్రధాన రహదారి, అర్బన్ కాలనీకి వెళ్లే మార్గం జలదిగ్బంధంలో చిక్కుకుంది.