క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడలు ప్రారంభం
కోహెడ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని.. గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్(Gavva Kamalamma Charitable Trust) వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీదర్ రెడ్డి మాట్లాడుతూ..
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా నలుమూలల నుండి హాజరైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్, జూదం ,ఆన్లైన్ గేమ్స్ కి బానిస కాకూడదని ఇలాంటి క్రీడా పోటీలలో పాల్గొని శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. పోటీలలో గెలుపోటములు సహజమని గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. గత 12 సంవత్సరాలుగా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు .
ఈ పోటీలలో గెలుపొందిన మొదటి జట్టు (విన్నర్) రూ.10 వేల నగదు తో పాటు ట్రోఫీని.. రెండవ జట్టు (రన్నర్) రూ.5 వేల నగదు తో పాటు ట్రోఫీని అందజేస్తామని తెలిపారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బెస్ట్ ప్లేయర్ అవార్డు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్, గ్రామ ప్రజాప్రతినిధులు సుజాత, వెంకటేష్, ఎన్జీఓ ప్రతినిధి వలస సుభాష్ చంద్రబోస్, నాగరాజు, శ్రీనివాస్, ప్రవీణ్ ,సదానందం,ఆర్గనైజర్స్ రఘు, అవినాష్, వంశీ, అంజి, మనీ తదితరులు పాల్గొన్నారు.