సిద్దిపేట ఐటీఐ కాలేజ్ లో ఈనెల 22 వరకు స్పాట్ అడ్మిషన్లు..

17-09-2026 | 10:45pm

​ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్. రామానుజ..

సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 17: సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐ కాలేజ్(Siddipet Government ITI College)లో ఈనెల 22 వరకు  స్పాట్ అడ్మిషన్ల ను నిర్వహించనున్నట్లు సిద్దిపేట ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్. రామానుజ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ, ఏటీసీ సెంటర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని, 10 వ తరగతి పాసై ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని,  పైచదువులు చదివి ఆపేసిన వారు కూడా అర్హులేనని అన్నారు.

అన్ని కోర్సుల విద్యార్థిలు కూడా అర్హులేనని, వయోపరిమితి లేదని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.iti.telangana.gov.in అనే వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌ లో 22వ తేదీ మధ్యాహ్నం 1:00 గంట లోపు దరఖాస్తు చేసుకొవాలని సూచించారు. మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ లో 12 ఖాళీలు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ 11 ఖాళీలు, ఆర్టీసన్ యూజింగ్ అడ్వాన్స్డ టూల్ లో 9 ఖాళీలు, అడ్వాన్స్డు  సిఎన్ సి మిషనింగ్ టెక్నీషియన్ లో 02 ఖాళీలు,  బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ లో 18ఖాళీలు అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తు చేసుకునే వారు పదవతరగతి  మార్క్స్ మెమో, బోనాఫైడ్, కుల ధృవీకరణ పత్రం ఇమెయిల్ ఐడి, ఫోటో, ఫోన్ నంబర్ తో తమ సెంటర్ లో ప్రతి రోజు మధ్యాహ్నం 1 గం లోపు హాజరు కావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు