అనురాగ్ లో యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన
ఘట్ కేసర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లోని సైబర్ సెక్యూరిటీ(Cyber Security) విభాగం సిఎస్‌ఐ ప్రొఫెషనల్ చాప్టర్ సంయుక్తంగా డిఫెండింగ్ ది ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీ డేటా అనాలిసిస్ అండ్ ఏఐ థ్రెట్ డిటెక్షన్ అనే అంశంపై వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి (హెచ్‌ఓడీ) డాక్టర్ నితీషా శర్మ, కార్యక్రమ సమన్వయకర్త మునీర్ అహ్మద్, ఇతర విభాగాల అధ్యాపకులు, సిబ్బంది 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ సుజోయ్ భట్టాచార్య ముఖ్య అతిథిగా హాజరై సైబర్ సెక్యూరిటీ రంగంలో డేటా విశ్లేషణ ప్రాముఖ్యత, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్, లాగ్ అనాలిసిస్, ఏఐ సాయంతో ముప్పులను ముందుగానే గుర్తించే పద్ధతులపై విద్యార్థులకు వివరించారు. ఆధునిక ఎంటర్‌ప్రైజ్ వాతావరణంలో సైబర్ దాడుల స్వరూపం, ఫిషింగ్, డీప్‌ఫేక్‌లు, పాలిమార్ఫిక్ మాల్వేర్, లివింగ్ ఆఫ్ ది ల్యాండ్ వంటి ఆధునిక ముప్పుల గురించి ఆయన వివరించారు. సైబర్ దాడులను సమర్థవంతంగా గుర్తించి, వాటికి వేగంగా స్పందించేందుకు ఆధునిక సెక్యూరిటీ వ్యవస్థల అవసరాన్ని వివరించారు.