గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
17-09-2026 | 11:51pm
* ఎల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలు
పాపన్నపేట,సెప్టెంబర్17: గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా వినియోగించాలని ఐసిడిఎస్ సిడిపిఓ వెంకట రమణమ్మ(ICDS CDPO Venkata Ramanamma) సూచించారు. గురువారం మండల పరిధిలోని ఎల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాలు అందించడం జరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకున్నప్పుడే రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించవచ్చని పేర్కొన్నారు.