జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన పోలీస్ కమిషనర్
16-09-2026 | 04:34pm
పెద్దపల్లి, సెప్టెంబర్ 16(విజయ క్రాంతి): జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పెద్దపల్లి జిల్లా ఎన్‌టీపీసీలోని జ్యోతి భవన్‌కు బుధవారం విచ్చేశారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరం మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు.