బండ్లగూడ రైతు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

24-10-2026 | 03:37pm

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) శనివారం లింగాల ఘనపురం మండలం(Lingala Ghanapuram mandal) బండ్లగూడ గ్రామంలోని మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నిల్వలను, రైతులకు అందిస్తున్న సేవలను కలెక్టర్ పరిశీలించారు. వ్యాపార లావాదేవీల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు సుమారు 60 టన్నుల యూరియా సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను(agricultural products) విక్రయించి రూ.19 లక్షల మేర వ్యాపారం నిర్వహించినట్లు నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు