బూత్ కమిటీల బలోపేతమే బీజేపీకి పునాది
ప్రతి బూత్‌లో పార్టీని పటిష్టం చేయాలి
బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు
హుజురాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ హుజురాబాద్(BJP Huzurabad) పట్టణ శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్చార్జిల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల నిర్మాణం, యువకుల సమ్మేళనాలు, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాల(Mann Ki Baat program)పై చర్చించారు. ప్రతి బూత్‌లో క్రియాశీలక కార్యకర్తలతో కమిటీలను పటిష్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు పిలుపునిచ్చారు.
జిల్లా పార్టీ సూచన మేరకు ఆదివారం ప్రతి శక్తి కేంద్ర పరిధిలో టిఫిన్ బైఠక్‌లు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, సబ్బని రమేష్, తూముల శ్రీనివాస్, గంట సంపత్, తిప్పబత్తిని రాజు, యాల్ల సంజీవరెడ్డి, వోడ్నాల విజయ్, కొలిపాక వెంకటేష్, యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, అంకతి వాసు తదితరులు పాల్గొన్నారు.