ఎస్సార్ఎస్పీ క్వార్టర్స్‌ను పరిశీలించిన కలెక్టర్
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామం(Dimmadurthi village)లో ఎస్సార్ఎస్పీ క్వార్టర్స్ కుటుంబాల(SRSP quarters families)ను జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(Collector Bhavish Mishra) సందర్శించారు గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కుటుంబాల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆయా కుటుంబాలకు ఇందిరమ్మ కాలనీలో స్థలాలు కేటాయించే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి, నివాసితుల సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు గారితో పాటు ఎమ్మార్వో, తహసీల్దార్, హౌసింగ్, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.