అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
నిర్మల్(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తుల(Prajavani applications) పరిష్కారంలో జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా(Nirmal District) కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సమీక్షించి, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.