ఏఎస్ఐ నుంచి ఎస్సైగా ఉద్దవ్‌కు పదోన్నతి
12-10-2026 | 08:36pm
జిల్లా ఎస్పీ నితిక పంత్‌ను మర్యాదపూర్వకంగా ఉద్ధవ్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తిర్యాణి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ముండే ఉద్దవ్( 471) ఎస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ నితిక పంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన ఉద్దవ్‌కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.