‘సూపర్ ఎల్ నినో’ డేంజర్ బెల్స్
- ప్రపంచ వ్యాప్తంగా 4.51 లక్షల మరణాలు?
- భారత్‌లోనూ 15,800 చనిపోయే ప్రమాదం
- దేశాలు హీట్ యాక్షన్ ప్లాన్లు రెడీ చేసుకోవాలి హెచ్చరిక
- చికాగో క్లుమైట్ ఇంపాక్ట్ ల్యాబ్ సంచనల నివేదిక
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్ నినో డేంజర్ బెల్స్(Super El Nino alarm bells) మోగుతున్నాయి. ఎండల తీవ్రత మరింత దంచికొడుతాయని, సూపర్ ఎల్ నినో కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తం గా 4.51లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని చికాగో క్లుమైట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక(Chicago Climate Impact Lab Report) బుధవారం పేర్కొంది. భారత్‌లోనూ 15,800 చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వాలు మేల్కోన కుం టే ముప్పు తప్పదని తేల్చిచెప్పింది.
1996 నుంచి 2025 ప్రపంచ వాతావరణం(Global climate)పై పరిశోధన జరిపిన అనంతరం ఈ సంచలన నివేదికలోని అంశాలను వెల్లడిస్తూ ప్రపంచదేశాలను అప్రమత్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం.. భూమిపై అసాధారణమైన, ఊహించని రీతిలో ఉష్ణోగ్రతల ప్రభావం(Impact of temperatures) రాబోయే కాలంలో ఉండబోతుంది. వర్షపాత సరళి మార్పు వల్ల కరువులు, కార్చిచ్చులు, వరదల ప్రభావం సంభవించే అవకాశం ఉంది. దీంతో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణిస్తారు. దీని నుంచి మానవాళిని రక్షించుకునేందుకు తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి.
ఎల్‌నినోతో మానవాళిని కాపాడుకునేందుకు అత్యవసర చర్యలు చేపట్టాల్సిందే. ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఉపద్రవం ఇందుకు ఒక నిదర్శనం. రా బోయే విపత్తు దానికంటే వందలరెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఉపద్రవ వల్ల అత్యధికంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో మరణాలు సంభవించే అవకాశం ఉంది. రాబోయే ఆరు నెలల్లో ఆఫ్రికాలో 66,800, నైజీరియాలో 31,400, సుడాన్‌లో 17,500, నైజర్‌లో 10,000, చాడ్‌లో 8 వేల మంది, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియాలో 19,400మంది, ఇండోనేషియాలో 19,300, భారత్‌లో 15,800, బ్రెజిల్‌లో 13,300 మరణాలు సంభవించే అవకాశం ఉంది.
సాధారణ సంవత్సరంతో పోలిస్తే రాబోయే ఆరు నెలల్లో భారతదేశంలో వేడి సంబంధిత కారణాల వల్ల సుమారు 15,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. జూన్‌లో మొదలైన ఎల్ నినో పరిస్థితులు రాబోయే నెలల్లో ‘అత్యంత తీవ్రమైన స్థాయికి‘ చేరుకుని, ఫిబ్రవరి 2027 వరకు కొనసాగుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) పేర్కొంది. దీనివల్ల ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 2027 మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమా రు 2,39,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. శీతలీకరణ, ఆహార భద్రత ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది.