గణేష్ నిమజ్జనంలో అపశృతి
24-09-2026 | 09:15am
యువకుడు గల్లంతు
మసాయిపేట్ /చేగుంట సెప్టెంబర్ 24, విజయక్రాంతి: గణేష్ నిమజ్జనంలో(Ganesh immersion) అపశృతి యువకుడు గల్లంతు చెందిన సంఘటన మెదక్ జిల్లా(Medak District) మసాయిపేటలో పట్టణ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది, పట్టణ కేంద్రం లో రాత్రి వినాయకుని నిమజ్జన కోసం హల్దీ వాగుకు తీసుకువెళ్లారు. వినాయక నిమజ్జనం అనంతరం ఉదయం 3 గంటల సమయంలో హల్దీ కాలువలో దిగిన పట్టణ నికి చెందిన కమిండ్ల గణేష్ (35) గల్లంతయ్యారు. దీంతో స్థానికులు చేగుంట పోలీసులకు సమాచారం అందించారు. చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని,గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.
MUST READ: నిమజ్జనం వేళ విషాదం