కంగ్టి మండలంలో భారీ చోరీ

24-09-2026 | 09:24am

బంగారం,వెండి,నగదు అపహరణ

కంగ్టి, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): కంగ్టి మండలంలోని(Kangti Mandal) చాప్టా కే గ్రామంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగినట్లు సమాచారం. గ్రామానికి చెందిన బాధితుడు సేరి నాగొండ,తండ్రి హన్మగొండ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు తులాల బంగారం,50 తులాల వెండి కడియాలు, రూ.25 వేల నగదు అపహరణకు(theft) గురైనట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దుర్గారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన ప్రదేశంలో ఫింగర్‌ప్రింట్ నిపుణుల ద్వారా ఆధారాలు సేకరించనున్నట్లు ఎస్సై తెలిపారు. ఫింగర్‌ప్రింట్ సిబ్బంది వచ్చి పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై దుర్గారెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

MUST READ: గణేష్ నిమజ్జనంలో అపశృతి


మరిన్ని వార్తలు