తూప్రాన్ మున్సిపల్ మెయిన్ గేట్‌కు వార్నింగ్ లెటర్
21-09-2026 | 01:44pm
తూప్రాన్, సెప్టెంబర్ 21,(విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్ ప్రధాన గేటుకు హెచ్చరిక లేఖ కలకలం సృష్టించింది. ఏపీటిహెచ్ అలెగ్జాండర్(APTH Alexander) పేరుతో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు లేఖ(Letter) రాసి అంటించారు. పదిమంది విప్లవ యోధులను ఉరి తీయడాని ఖండిస్తూ దుండగులు ప్రధాన గేటుకు లేఖ రాసి పెట్టారు. ముఖ్యమంత్రి మేడారం పర్యటనలో ఉండగా ముందుగా మొదటి లేఖను విడుదల చేశామని ఇప్పుడు రెండవ లేక విడుదల చేశామని లేఖలో లిఖించారు. ఒకవేళ ఉద్యమాన్ని అణచివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.