‘జడల్’తో షాక్ ఇస్తాం!.. ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు?

21-09-2026 | 12:52pm

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి హోం శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రదర్శితమయ్యే షోకు టికెట్ ధర (GSTతో కలిపి) రూ.500గా ఉంటుంది. సింగిల్ స్క్రీన్‌ల విషయానికి వస్తే, సెప్టెంబర్ 24 నుండి 27 వరకు సవరించిన ధరలు GSTతో కలిపి రూ.48గానూ, సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు GSTతో కలిపి రూ.23గానూ ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్ల విషయానికి వస్తే, సెప్టెంబర్ 24 నుండి 27 వరకు పెంచిన టికెట్ ధరలు GSTతో కలిపి రూ.95గానూ, సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు GSTతో కలిపి రూ.45గానూ నిర్ణయించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ధరలు రోజుకు ఐదు షోలకు వర్తిస్తాయి.  ‘జడల్’తో షాక్ ఇస్తాం ‘ది ప్యారడైజ్’ థియేటర్లను ఊపేస్తోందని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో రచ్చ చేసేందుకు వస్తున్న 'ది ప్యారడైజ్' టీమ్ ఇదే

చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించిన 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్రంలో ప్రధాన తారాగణం (Cast & Characters)నాని – జడల్ (Jadal), కయాదు లోహర్ – సుబ్బు (Subbu), మోహన్ బాబు – షికంజా మాలిక్ (Shikanja Maalik), రాఘవ్ జుయల్ – విక్రమ్ మాలిక్ (Vikram Maalik) సంపూర్ణేష్ బాబు – బిరియాని (Biriyani), సోనాలి కులకర్ణి ఇతర ముఖ్య పాత్రల్లో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, కీర్తి సురేశ్ కనిపించనున్నారు. నాని జడల్ తో రచ్చ  చేసేందుకు వస్తున్న ఈ సిన్మాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.


మరిన్ని వార్తలు