కోటగుళ్ళలో ఎస్ఐ దంపతుల పూజలు
21-09-2026 | 01:09pm
గణపురం సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Ganapeshwara Temple) కోటగుళ్ళలో ఎస్ఐ రాజశేఖర్(SI Rajashekhar), యోగిత దంపతులు సోమవారం స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపురం పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్సైగా పనిచేసి బదిలీపై వెళ్తున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.