రీసర్వే స్పీడ్‌అప్.. రైతుల భూ సమస్యలకు చెక్!

08-10-2026 | 10:56am

కల్లూరు, అక్టోబర్ 08 (విజయ క్రాంతి): కల్లూరు మండలం రఘునాథగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఐఏఎస్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలన తదితర ప్రక్రియలను పరిశీలించి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి: ఆక్రమణలకు చెక్.. రహదారులకు ఊపిరి!

అనంతరం రైతులతో మాట్లాడి రీసర్వేపై వారి అభిప్రాయాలు, సమస్యలు, అభ్యంతరాలను తెలుసుకున్నారు. భూ వివరాల నమోదు పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని, రీసర్వే పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కర్నాటి రామకృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, పొరుగుమాటి శ్రీనివాసరావు, రంగయ్య, జీపీఓ రాంబాయి, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు