అరెస్ట్ ఎందుకో చెప్పాలి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

22-09-2026 | 08:06am

అరెస్ట్ చేసే సమయంలో నిందితుడికి అర్థమయ్యే భాషలో కారణాలను రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. అలా చేయకుండా అరెస్ట్ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. పంజాబ్ కేసులో అరెస్ట్ కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వనందుకు ఆ అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టికల్ 22(1) కింద అరెస్ట్ కారణాలు తెలుసుకునే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది.

మరిన్ని వార్తలు