డబుల్ ఓట్ల తొలగింపునకు పాదయాత్ర

22-10-2026 | 11:15am

జడ్చర్ల, అక్టోబర్ 22 (విజయక్రాంతి): డబుల్ ఓట్లు (Duplicate Votes) తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాఘవేంద్రరాజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు చేపట్టిన పాదయాత్ర (Foot March) బుధవారం జడ్చర్ల మీదుగా కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి, ఆయన సతీమణికి సంబంధించి డబుల్ ఓట్లు ఉన్నా తొలగించడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు (State Election Commission) నేరుగా ఫిర్యాదు చేసేందుకు పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలోని ద్వంద్వ నమోదులపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు