‘సత్యాగ్రహం’ స్టార్ట్

04-10-2026 | 11:47am

9 గంటల్లోనే 10 వేల స్పందనలు

CECపై నిరసనలకు రాహుల్ కొత్త అస్త్రం

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC Gyanesh Kumar) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆందోళనలు, నిరసన ఉద్యమాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ‘సత్యాగ్రహం’(Satyagraha Platform) పేరుతో ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ వేదిక ప్రారంభమైన కొద్ది గంటల్లోనే భారీ స్పందన రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

శనివారం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో నిజం అణచివేతకు గురవుతోందని, ప్రతిపక్ష నేతగా ప్రజల పోరాటాలకు అండగా నిలవడం తన బాధ్యతని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, ప్రజా ఉద్యమాల వివరాలను ఈ డిజిటల్(Digital Satyagraha) వేదిక ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

ప్లాట్‌ఫామ్ ప్రారంభమైన కేవలం తొమ్మిది గంటల్లోనే 10 వేలకు పైగా స్పందనలు వచ్చినట్లు రాహుల్ వెల్లడించారు. తమ మాట ఎవరూ వినడం లేదని భావిస్తూ ఎంతోమంది ప్రజలు పోరాటాలు చేస్తున్నారని, వారి ప్రతి స్పందనను పరిశీలిస్తామని తెలిపారు. మరోవైపు CEC తొలగింపు డిమాండ్‌తో ప్రతిపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు, యువజన సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రారంభించిన ‘Satyagraha Digital Platform’ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు