రైతులకు గుడ్ న్యూస్

04-10-2026 | 12:15pm

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-Kisan Samman Nidhi) 24వ కిస్తు కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు PM Kisan 24th Kist విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో కిస్తు కోసం ఎదురుచూస్తున్న రైతులు మాత్రం చివరి నిమిషం వరకు ఆగకుండా తమ వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. PM Kisan Status Check, వివరాల సవరణ, మొబైల్ నంబర్ మార్పు వంటి పలు సదుపాయాలను అధికారిక పోర్టల్‌లోనే పొందవచ్చు.

1. వివరాల్లో తప్పులు ఉంటే ఇప్పుడే సరిచేయండి

మీ PM Kisan Registration వివరాల్లో ఏదైనా సమాచారం అసంపూర్తిగా ఉంటే దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం పోర్టల్‌లోని Update Missing Information ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా నమోదు చేసి రికార్డును వెతికితే అవసరమైన వివరాలను గుర్తించి ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. కిస్తు సమయంలో ఇబ్బందులు రాకుండా ముందుగానే ఈ వివరాలను పరిశీలించుకోవడం కీలకం.

2. మొబైల్ నంబర్ మారిందా? వెంటనే అప్డేట్ చేయండి

ఫోన్ నంబర్ మార్చుకున్న రైతులు తమ PM Kisan Mobile Number Update వివరాలను కూడా సరిచూసుకోవాలి. పోర్టల్‌లోని Update Mobile Number ఆప్షన్ ద్వారా ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉపయోగించి రికార్డును యాక్సెస్ చేసి కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకునే అవకాశం ఉంది.

3. అర్హత లేకపోయినా డబ్బులు వస్తున్నాయా?

తాను PM Kisan Yojanaకు అర్హుడు కాదని తెలిసినప్పటికీ గతంలో కిస్తు డబ్బులు అందుకున్నట్లయితే, వాటిని తిరిగి చెల్లించేందుకు పోర్టల్‌లో Online Refund సదుపాయం ఉంది. రిజిస్ట్రేషన్ లేదా ఆధార్ నంబర్‌తో వివరాలను వెతికి, OTP ద్వారా తదుపరి ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

4. సమస్య పరిష్కారం కాకపోతే అధికారిని నేరుగా సంప్రదించండి

PM Kisan పథకానికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారిని సంప్రదించే అవకాశం కూడా ఉంది. పోర్టల్‌లోని Search your Point of Contact (POC) ద్వారా రాష్ట్రస్థాయి అధికారుల వివరాలు తెలుసుకోవచ్చు. జిల్లా సమస్యల కోసం Search District Nodal ఆప్షన్ ఉపయోగించవచ్చు. రాష్ట్రం, జిల్లా ఎంపిక చేసిన తర్వాత సంబంధిత అధికారి పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. కీలకంగా గుర్తుంచుకోవాల్సింది: PM Kisan 24వ కిస్తు విడుదల తేదీ అధికారికంగా ప్రకటించే వరకు సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక తేదీలను నమ్మకుండా, రైతులు తమ PM Kisan Beneficiary Status, బ్యాంక్ వివరాలు, ఆధార్ సంబంధిత సమాచారం, మొబైల్ నంబర్ వంటి వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు