రేపే ‘వృషకర్మ’ ట్రైలర్ లాంచ్!
అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘వృషకర్మ’(Vrushakarma) నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకోసం నెల్లూరులో భారీ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వేదికగా ఈ వేడుక జరగనుంది.
నెల్లూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్
దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. నాగచైతన్య ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తుండగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి, సీనియర్ నటుడు జయరామ్ పోస్టర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.