మంత్రి తుమ్మల చాతుర్యం తో ఆయిల్ ఫెడ్ కు 3 కోట్ల లాభం
దమ్మపేట, సెప్టెంబరు 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్(Telangana State Oil Palm) రైతు సంఘ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 1987 సెప్టెంబర్ 17న తొలి పామ్ ఆయిల్ మొక్కను ఆ నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాటి సరిగ్గా 39 సంవత్సరాలు కావస్తుందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ మధ్య ఆయిల్ ఫెడ్ లో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, కల్లూరుగూడెం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ లో ఆరు వర్కులకు సంబంధించి 14 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారని, వీటిలో తారు రోడ్లు, వాటర్ ట్యాంకు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, సిమెంట్ రోడ్ల పనులకు ఒకే టెండర్ గా ఎక్విప్మెంట్ వున్నవారు మాత్రమే టెండర్లో పాల్గొనాలని షరతు విధించడంతో రెండు టెండర్లు మాత్రమే 2 శాతం లెస్ తో రావడంతో కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ వర్క్ కు ఆ వర్కును వేరుగా చేసి టెండర్ పిలవాలని సూచించడంతో ఆరు వర్కులకు టెండర్ లు పిలిచారని, దీంతో ఇప్పుడు సుమారు 20 శాతం నుండి 30 శాతం వరకు లెస్ వచ్చి ఆయిల్ టెడ్ కు సుమారు 3 కోట్ల రూపాయల లాభం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పి టి సి పైడి వెంకటేశ్వరావు, కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు, కె వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.