ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే జీఎంఆర్
05-09-2026 | 05:10pm
చిన్నచింతకుంట(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల(Government school)ల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు, పౌష్టికాహారం అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు. చిన్నచింతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల(Students)కు నోట్స్ బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు, విద్యా సామగ్రి, మెరుగైన తరగతి గదులు, బ్రేక్‌ఫాస్ట్(Breakfast), ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






