వీ.బి.జి. రామ్ పథకంలో పనులను గుర్తించాలి
హన్వాడ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్ శవకుల స్వాతి ఆధ్వర్యంలో గ్రామసభ(Gram Sabha) నిర్వహించారు. ఈ సందర్భంగా వి.బి.జి. రామ్ పథకంలో 367 రకాల పనులు చేపట్టే అవకాశం ఉందని ఆమె రైతులకు వివరించారు. గ్రామానికి సంబంధించిన పటాన్ని గీసి, చేపట్టగల పనులపై అవగాహన కల్పించారు.
గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అత్యవసరమైన పనులను ముందుగా గుర్తించి చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, చెరువు పనులు, బోర్ల వద్ద నీటి నిల్వ పనులతో పాటు కూరగాయల పందిళ్లు, మామిడి, నిమ్మ, కొబ్బరి తోటలు, పశువుల కొట్టాలు, నాటు కోళ్ల, మేకల షెడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను కూడా చేపట్టవచ్చని వివరించారు.