‘సర్’పై ఇండీ కూటమి ఆందోళనలు
- 6న కలెక్టరేట్ల ఎదుట నిరసనలు
- 8న లోక్‌భవన్ ముట్టడి, నవంబర్ 1న ఛలో ఢిల్లీ
- టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాం తి) : కేంద్ర ఎన్నికల సంఘం, సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు చేపట్టనున్నట్లు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(TPCC State President Mahesh Kumar Goud) తెలిపారు. ఈ నెల 6న జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 8న లోక్‌భవన్ ముట్టడి ఉంటుందని తెలిపారు. నవంబర్ 1న ‘ఛలో ఢిల్లీ’తో నిరసనలు కొనసాగించనున్నట్లు శనివారం ఆయన మీడియాతో ప్రకటించారు.
సీఈసీ వ్యవహారంపై ఇండీ కూటమి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తెలిపారు. అర్హత కలిగిన లక్షలాది మంది ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను, ఎన్నికల వ్యవస్థను రాజకీయ ప్రయో జనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యల వల్లే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయారం టూ వ్యాఖ్యానించారు.
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాం డ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ ఫారం-6 ద్వారా కొత్త ఓట్లు చేర్చుకునే విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తొలగించిన ఓట్లలో అర్హులైన వారి పేర్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో మార్పులను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
సీపీఐ నేత ఈటీ నర్సింహ మాట్లాడుతూ దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ప్రస్తుత పరిణామాలపై ఆలోచించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకుని, తమ ఆందోళనల్లో భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ యు వజన విభాగం అధ్యక్షుడు సలీం పాషా మా ట్లాడుతూ ఒక నిర్దిష్ట సమూహానికి చెందిన ఓట్లను తొలగించేందుకు బీఎల్‌ఓలపై బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తె లంగాణలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.
5న పీసీసీ అధ్యక్షుల సమావేశం
ఈనెల 5న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్చార్జీలతో సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఇండీ కూటమి చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొననున్నారు.