బాధ్యత నాది

04-10-2026 | 05:30am
  1. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయిస్తా
  2. కేంద్ర సంక్షేమ పథకాలకు సరిపోయేలాnడీపీఆర్‌లు పంపండి
  3. హైదరాబాద్ బడ్జెట్ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
  4. ‘దిశా’ కమిటీ భేటీలో అధికారులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు(Welfare and development schemes) అందుబాటులో ఉన్నాయని, వాటికి సరిపోయేలా రాష్ట్ర అధికారులు సరైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లు, ప్రతిపాదనలు తయారుచేసి పంపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. అధికారులు నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు పంపితే, కేంద్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణకు నిధులు మంజూరు చేయించి తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టంచేశారు.

అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి హైదరాబాద్‌ను ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ తార్నాకాలోని సీఎస్‌ఐ ఆర్ సమావేశ మందిరంలో హైదరాబాద్ జిల్లా ‘దిశా’ కమిటీ చైర్‌పర్సన్, కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడు తూ, గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కేవలం నినాదాలతో సాధ్యంకాదని,

పాలనా యంత్రాంగం పూర్తి సమన్వయంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించి పనిచేసినప్పుడే సాధ్య మవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న కొద్దీ జిల్లాల సరిహద్దులు, కార్పొరేషన్లు వేరైనా నగరాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించి ప్రణాళికలు వేయాలని అధికారులకు సూచించారు. హైదరాబా ద్, మేడ్చల్- తదితర జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ,

సైబరాబాద్ పరిధిలోని ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు పర స్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సమకూరే మొత్తం ఆదాయంలో 70 నుంచి 80 శాతం రెవెన్యూ ఒక్క హైదరాబాద్, పరిసర జిల్లాల నుంచే వస్తోందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. అటువంటి మహానగరంలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించే జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు వంటి సంస్థలు నిధుల కొరతతో సతమతం కావడం విచారకరమన్నారు.

రొటీన్ బడ్జెట్ కేటాయింపు లతో సరిపెట్టుకోకుండా, నగర ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ పెంచుకునేందుకు అధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించారు. మెట్రో, మూ సీ సుందరీకరణ వంటి భారీ ప్రాజెక్టులు ప్రభుత్వ ఆలోచనల ప్రకారం జరుగుతున్నప్పటికీ, సామాన్య ప్రజలు నిత్యం ఎదుర్కొనే సివిక్ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం, అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫ రా, డ్రైనేజీ లీకేజీల నియంత్రణ, మురుగునీరు వేరుచేసే శాస్త్రీయ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల నిర్వహణ వంటి అంశా ల్లో అలసత్వం వహించరాదన్నారు. బిల్లుల చెల్లింపు ల్లో జాప్యం వల్ల కాంట్రాక్టర్లు పను లు చేయడానికి ముందుకు రాని పరిస్థితి మారాలని, పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని సూ చించారు.

పేదలు నివసించే బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను రూ. 10 లక్ష ల నుంచి రూ. 20 లక్షల వ్యయంతో ఫ్లోరిం గ్, టైల్స్, పెయింటింగ్, తాగునీటి వసతులు, పిల్లలకు దుప్పట్లు, యూనిఫాంలు వంటి సకల సదుపాయాలతో ఆదర్శవంతంగా తీ ర్చిదిద్దిన అనుభవాన్ని ప్రస్తావించారు. 


 

మరిన్ని వార్తలు