బ్యాలెట్ ఎన్నికలకు సిద్ధమా?

04-10-2026 | 05:15am

కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాం తి): కేంద్ర ఎన్నికల సంఘం, ఈవీఎంలపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ తీరు పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళం, తెలంగాణ, కర్నాటక, హి మాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాం గ్రెస్.. సీఎంలతో రాజీనామా చేయించి బ్యా లెట్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ఆహ్వానించారు.

ప్రపం చమంతా కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్య సాహసాలను కొనియాడతుంటే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. మచ్చార్‌పై దాడి చేసిన వ్యక్తి సామాజికవర్గం ఓట్లు పోతాయనే భయంతోనే కాంగ్రెస్ నోరు మెదప డం లేదని, అలాంటి వాళ్లంతా తన దృష్టిలో దేశద్రోహులు,

దిమాగీ నక్సల్సేనని ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హైదరాబా ద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు డాక్టర్ మనోహర్ రెడ్డి, సంగప్ప, శ్రీవర్దన్ రెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అనివార్య కారణాల తో తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన వాయిదా పడిందని తెలిపా రు. దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయంలో దాడి హేయనీయమన్నారు.  ఘట నపై సమగ్రవిచారణ జరిపించాలన్నారు. 

మరిన్ని వార్తలు