హాస్టళ్లలో సిబ్బందిని పెంచాలి
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బీసీ నేతల చర్చలు
ముషీరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజీ హాస్టళ్లలో సిబ్బంది, సీట్ల కొరతను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య(Rajya Sabha member R. Krishnaiah) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)ను కోరారు. ఈ మేరకు శుక్రవారం బీసీ నేతలతో కలిసి డిప్యూటీ సీఎంతో చర్చించారు. ప్రతి హాస్టల్ కు అటెండర్, వాచ్‌మన్, కమాటి, కుక్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి 25 మం దికి ఒక అదనపు వర్కర్‌ను నియమించాల ని, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును గ్రేడ్- 1గా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కాలేజీ హాస్టళ్లలో 10శాతం సీట్లు పెంచడం తోపాటు కొత్తగా 100 హాస్టళ్లు, 50 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మం జూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీల వెం కటేష్, పగిళ్ల సతీష్, సి. రాజేందర్, అంజి గౌడ్, నరేష్ గౌడ్, శివకుమార్‌యాదవ్, బల రాం, కె. వంశీ తదితరులు పాల్గొన్నారు.