MLC ఎన్నికలు.. సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువతకు పలు సలహాలు, సూచనలు తెలియజేసారు. పెద్దలు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ విజయం తో మనం అందరం గెలిపించుకోవాలి అని కోరారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మీ పట్టణాల్లో, గ్రామాల్లో, వార్డుల్లో అర్హులు గల అందరిని ఎమ్మెల్సీ ఎన్నికలు కోసం ఓటర్ ఆన్లైన్ చేపించాలని కాంగ్రెస్ శ్రేణులకు తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు ఎంపీ రఘు రాం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ ఈ సందర్బంగా ఉప ముఖ్య మంత్రి భట్టికి, మంత్రివర్యులు తుమ్మల కి, పొంగులేటి కి, ఎంపీ రఘు రాం రెడ్డి కి ధన్యవాదములు తెలియజేసారు.
సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మరియు ఖమ్మం జిల్లా ఎంపీ Icse సహాయం రఘు రాం రెడ్డి. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు nsui, యూత్, మహిళలు సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు నెంబర్స్, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.