పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం

17-09-2026 | 08:51pm

లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కూసుమంచి,(విజయక్రాంతి): పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మల్లేపల్లి గ్రామానికి చెందిన 16 మంది అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు(double bedroom), మునిగేపల్లి గ్రామానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం అంటే కేవలం పథకాలను ప్రకటించడం కాదు.. ఆ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబం గడపకు చేరేలా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని గతంలో సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు, ఇంటి స్థలం, అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

పేదల సొంతింటి కలను నిజం చేస్తూ.. ఆత్మగౌరవంతో జీవించేలా భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ దివాకర, ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో జీ నరసింహారావు, కూసుమంచి MRO సైదులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, మునిగేపల్లి సర్పంచ్ గంగా స్రవంతి --రవి, మల్లేపల్లి సర్పంచ్ తెల్ల మేకల భవిత--కనకయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది..

మరిన్ని వార్తలు