సీఐ, ఎస్ ఐలను అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ముకరంపుర, అక్టోబర్ 16(విజయక్రాంతి): ఏక్ ధం న్యూస్ జర్నలిస్టులపై(Ek Dham News journalists) థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ, ఎస్ ఐలను వెంటనే అరెస్టు చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST Atrocity Case) నమోదు చేయాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆరెల్లి మల్లేష్(Arelli Mallesh), కట్కూరి మల్లేష్ డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై(Journalists') పోలీసుల దాడి ఘటనను తీవ్రంగా పరిగణించాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏక్ ధం న్యూస్ ఎడిటర్ పొత్తూరి శేఖర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో రాతిపల్లి సంపత్లను శుక్రవారం పరామర్శించారు.
2026 అక్టోబర్ 12న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో శేఖర్ డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ స్టేడియంలో ఉండగా, ఓ కారులో వచ్చిన ఎస్ ఐ సిహెచ్.శ్రీకాంత్, సివిల్ డ్రెస్లో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లారని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.