డ్రగ్స్ రహిత సమాజంతోనే వికసిత్ భారత్

21-09-2026 | 05:25am
  1.   2029 నాటికి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం
  2. ‘నశా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్’లో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ 
  3. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): మాదకద్రవ్యాలు(Narcotics) లేని ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంతోనే ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఆకాంక్షిం చిన వికసిత్ భారత్ సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్(K. Laxman) పేర్కొన్నారు. 2029 నాటికి డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్(Bicycle Station) నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ’అక్షరస్ఫూర్తి’ స్వచ్ఛం ద సంస్థ(Aksharasphurthi Voluntary Organization) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్’ ర్యాలీ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా విస్తరిస్తుండ టం ఆందోళన కలిగిస్తోందన్నారు. డ్రగ్స్ బారిన పడి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను,  ప్రగతిని అడ్డుకోవడానికి పొరుగు దేశాలు కుట్రపూరితంగా డ్రగ్స్, నార్కో-టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేశారు. డ్రగ్స్ దందా ద్వారా వచ్చే సొమ్మును దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

ఈ నేరపూ రిత శక్తుల ఆట కట్టించేలా మోదీ ప్రభు త్వం ’జీరో టాలరెన్స్’ విధానంతో పనిచేస్తోందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విధంగా 2029 నాటికి దేశాన్ని సంపూర్ణంగా మాదకద్రవ్యాల రహితంగా తీర్చిది ద్దేందుకు నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేర కు డ్రగ్స్ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హితవుపలికారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్య లు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌తో పా టు గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

యువతను కాపాడుకోవడంలో ఎలాంటి రాజకీయాలు లేకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక విభాగం ఈగ ల్ ఫోర్స్‌కు చెందిన శ్రీనివాస్, బీజేపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున           పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు