పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు!
రామచంద్రపురం, ఆగస్టు 12: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను (Smart Ration Cards) పంపిణీ చేశారు. వీఆర్‌ఓ నర్సింలు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్‌రావు చేతుల మీదుగా ఎస్. కనకమ్మ రేషన్ షాప్ నంబర్ 4లో లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ క్యూఆర్ రేషన్ కార్డులను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్యామ్‌రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషకరమని అన్నారు. అర్హులైన పేద కుటుంబాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని (Apply) వాటిని పొందాలని సూచించారు.
ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని శ్యామ్‌రావు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు (Welfare Benefits) అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.