ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులకు శ్రీకారం

21-09-2026 | 12:30pm

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం మూడ్ తండాకు చెందిన మూడ్ మాలతీ–గోపి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి(Indiramma House) స్లాబ్ నిర్మాణ పనులను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మాలతీ–గోపి దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు