టేకులపల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
17-09-2026 | 10:56pm
టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల(Viswakarma Jayanthi celebrations)ను విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విశ్వకర్మ భగవానుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఆలయ పూజారి మంతోజు పవన్ కుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జయంతి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.