ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

17-09-2026 | 09:01pm

దమ్మపేట,(విజయక్రాంతి): ప్రజాపాలన దినోత్సవాన్ని(prajapalana dinotsavam) పురస్కరించుకొని దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయం(dammapeta gram panchayat office)లో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు గురువారం వేడుకలలో పాల్గొని మహనీయుల ఫోటోలకు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. తదనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ... రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు పడిన చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య ద్వారా నిజాం పరిపాలించే హైదరాబాద్ పరిసర తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం అయినట్లు చెప్పారు.

తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రతీ ఒక్కరికీ ఘనంగా నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న మనము, ప్రజాపాలన అంటే ప్రజల హక్కులను కాపాడటమన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని కొనియాడారు. తదనంతరం పరిశుభ్రత మరియు పచ్చదనాన్ని పెంపొందించడానికి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.

పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలని, ఎవరినీ చెత్త రోడ్లపై వేయనివ్వకుండా చేస్తాం అని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, ఇంచార్జీ కార్యదర్శి కొల్లు దుర్గారావు, కాంగ్రెస్ నాయకులు అత్తులూరి వెంకట రామారావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా రాము, రూపా రాంబాబు, గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు