పేదింటి ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి పథకం

17-10-2026 | 05:08pm

తాంసి/భీంపూర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకం(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) పేద కుటుంబాల్లో ఆనందం నింపిందనీ, పేదింటి ఆడపిల్లల వివాహాలకు(Girls' marriages) ఆర్థిక భరోసా కల్పించే కల్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఒక వరమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Boath MLA Anil Jadhav) అన్నారు..శనివారం భీంపూర్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ తో కలిసి 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ  మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద కుటుంబాల కళ్లల్లో ఆనందం నిండిందని పేర్కొన్నారు.. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం అనేక కుటుంబాలకు అండగా నిలిచిందని అన్నారు.

అంతకు ముందు సవర్గవ్ నుండి నిపాని వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు..పనుల నాణ్యతను పరిశీలించి,రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు