తల్లి చనిపోయిన బాధలో తనయుడి ఆత్మహత్య..
తాగుడుకు బానిసైన కొడుకు...
ఉట్నూర్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): గత నెల 14వ తేదీన కన్నతల్లి గొల్లపల్లి నీలాబాయి అనారోగ్యంతో మృతి చెందినది. తల్లి మృతి చెందిన బాధతో తాగుడుకు బానిసై కొడుకు గొల్లపల్లి స్వామి(24) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, బీమ్ నగర్ వాసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీమ్ నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఒంటరిగా ఉంటున్న గొల్లపల్లి స్వామి శుక్రవారం మధ్యాహ్నం తన తల్లి చీరతో ఇంటి దూలానికి ఉరి వేసుకుని మృతి చెందారు. తల్లి మృతి చెందినప్పటి నుండి సరియైన భోజనం లేక తాగుడుకు బానిస అయ్యారని ప్రజలు తెలిపారు. ఒంటరిగా ఉంటున్న స్వామి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.