మున్సిపల్ సిబ్బందికి జీతాల విడుదల

17-10-2026 | 03:26pm

దసరా వేళ విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపిన కొల్లాపూర్ మున్సిపల్ సఫాయి కార్మికులు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ మున్సిపల్(Kollapur Municipal) కార్మికులకు దసరా వేళ పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలకు గానూ రెండు నెలల జీతాలు పంపిణీ చేశారు. ఈనెల 13న "కోన్ పుచ్ తా కొల్లాపూర్ "అనే వార్త కథనాన్ని విజయక్రాంతి ప్రచురించింది. మున్సిపల్ అభివృద్ధికి రాజకీయ గ్రహణం పట్టుకుందంటూ ఆ వార్త సారాంశం ఆధారంగా ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు(Minister for Excise and Tourism Krishna Rao) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రజలు కూడా పన్నులు కట్టేందుకు సహకరించాలని సూచించిన మేరకు పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా పన్నులు వసూలు అయినట్లు తెలిసింది. 71 మంది సాఫ్, సఫాయి కార్మికులతో పాటు మరో ఏడు మంది డ్రైవర్లు, పదిహేను మంది మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు వీరికి గత మూడు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ విషయాన్ని విజయక్రాంతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో ఈనెల 16న రెండు నెలల జీతాలు సుమారు 30 లక్షలు కార్మికులకు సిబ్బందికి పంపిణీ చేసినట్లు కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ శంకర్ తెలిపారు

మరిన్ని వార్తలు