భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు

22-10-2026 | 12:16pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణకాలనీలో అంబేద్కర్ స్టేడియం ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 2010 సంవత్సరం నుంచి శ్రీ మహా కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు (Sharannavaratri Celebrations) నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 17వసారి ఉత్సవాలను ఘనంగా, వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి డప్పు చప్పుళ్ల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి ఊరేగింపు (Procession) నిర్వహించారు. ఈ ఊరేగింపు కృష్ణకాలనీ, యాదవకాలనీ మీదుగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. భక్తుల సహకారం, దాతల తోడ్పాటుతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. 

మరిన్ని వార్తలు