యువత భవితకు బాటలు

10-10-2026 | 05:25am
  1. నైపుణ్యాలు పెంచుకోండి..
  2. ప్రజా ప్రభుత్వంలో 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 
  3. మంత్రి శ్రీధర్‌బాబు
  4. భూపాలపల్లిలో మెగా జాబ్‌మేళా

భూపాలపల్లి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్ప డ్డాక 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని, యువత భవితకు ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తున్నదని ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Duddilla Sridhar Babu) అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 

మంత్రి శ్రీధర్‌బాబు హాజరై వివిధ కంపెనీల ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జాబ్ మేళా ప్రారంభమైన రెండు గంటల్లోనే 600 మందికి పైగా యువత ప్రాథమికంగా ఎంపికైనట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రారంభంలో రూ.10 వేల నుండి రూ.20 వేల వేతనంతో ఉద్యోగంలో చేరినా, అనుభ వం, నైపుణ్యాలు పెంచుకుంటే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం పొందే అవకాశాలుంటాయని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి యువత అందుబా టులో ఉన్న ఉద్యోగావకాశాలను సద్వినియో గం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 142కు పైగా కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ప్రాం తీయ పరిమితులు విధించుకోకుండా అవకాశాలు వచ్చిన చోట వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.

ఎమ్మె ల్యే గండ్ర మాట్లాడుతూ.. భూపాలపల్లి నిరుద్యోగ యువతకు మెగా జాబ్మేళా మంచి అవకాశమని, దీని ద్వారా సుమారు 10 వేల నుంచి 12 వేల వరకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, టాస్క్ సీఈఓ ప్రదీప్‌రెడ్డి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కమిషనర్ ఉదయ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు