మాజీ ఎంపీటీసీ కన్నుమూత

10-10-2026 | 12:00pm

ఖానాపూర్, (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ రషీద్ మృతితో పట్టణంలో విషాదం నెలకొంది. గత నెలలో ఖానాపూర్–నిర్మల్ రహదారిపై ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో (Private Hospital) చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

రషీద్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీగా (MPTC) పనిచేస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందరితో కలివిడిగా ఉంటూ, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆయన మృతి పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన మృతి పట్ల స్థానికులు, పరిచయస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రషీద్ మరణంతో అంబేద్కర్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి

మరిన్ని వార్తలు