కారుణ్య నియామకం కింద ఆరుగురికి ఉద్యోగాలు
17-10-2026 | 03:43pm
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కారుణ్య నియామకాల కింద ఆరుగురికి ఉద్యోగాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్లతో కలిసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ముగ్గురిని జూనియర్ అసిస్టెంట్లుగా, మరో ముగ్గురిని కార్యాలయ సబార్డినేట్లుగా నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో శిక్షణ ఉప పాలనాధికారి జాస్తిన్ జోయల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.