మున్సిపల్ కార్మికులే నిజమైన హీరోలు

10-10-2026 | 01:07pm
  1. ఆసిఫాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులే నిజమైన హీరోలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్ అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ జన్మదినం సందర్భంగా శనివారం మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛ కేర్ కిట్లు (Hygiene Care Kits), టిఫిన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్మికులు ఎండీ అహ్మద్‌తో కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో చైర్మన్ ఆకాష్, కౌన్సిలర్లు వైస్ చైర్మన్‌ను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

    ఈ సందర్భంగా చైర్మన్ ఆకాష్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత (Town Sanitation) కోసం మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. వారి కృషి వల్లే పట్టణం పరిశుభ్రంగా ఉంటోందని కొనియాడారు.తనపై అభిమానం చూపిన కార్మికులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులకు వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు. 

    ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాపర్తి కార్తీక్, సాలం బీన్ అహ్మద్, బాలకృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, నాయకులు సయ్యద్ నిసార్, దూడల అశోక్, షేక్ సమద్, అనుమండ్ల సాయి, సాయి శ్రావణ్, కొండు సాయి, నిఖిల్, సయ్యద్ జావిద్, జాలింషా, సయ్యద్ అరఫాజ్ అలీ, జాఫర్, సమీర్ ఖాన్, మున్సిపల్ అధికారులు సర్వర్, రామయ్య, వార్డు జవాన్లు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు