యాతాలకుంట టన్నెల్ పనులు.. మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

21-09-2026 | 12:42pm

సత్తుపల్లి.సెప్టెంబర్ 21.(విజయ క్రాంతి): సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద టన్నెల్ పనుల(v)ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల(Minister Tummala) నాగేశ్వరరావు  ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం వద్ద సీతారామ పంప్ హౌస్ పరిస్థితిలను అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే సందర్భంగా ఇక్కడ పనుల పురోగతి, టన్నెల్ పనులను మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి తుమ్మల వెంట అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ తో పాటు ఇరిగేషన్ అధికారులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తదితరులు ఉన్నారు.


మరిన్ని వార్తలు